Published : 28 Jun 2022 05:54 IST

పంజాబ్‌లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు

బడ్జెట్‌లో పేర్కొన్న ఆప్‌ ప్రభుత్వం

చండీగఢ్‌: పంజాబ్‌లోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం తన మొదటి బడ్జెట్‌ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. జులై ఒకటి నుంచి గృహ వినియోగదారులకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించనున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హర్పాల్‌ సింగ్‌ చీమా ప్రకటించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 117 మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో కొత్తగా 16 వైద్య కళాశాలలను నెలకొల్పనున్నట్లు తెలిపారు. దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం, సుపరిపాలన హామీలను నెరవేర్చడంతోపాటు ఆరోగ్యం, వ్యవసాయం, విద్యపై మొదటి సంవత్సరం దృష్టి సారించినట్లు చీమా పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త పన్నులేవీ విధించలేదని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్తును కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ‘‘2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.1,55,860 కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాం. 14.20 శాతం వృద్ధిరేటును ఆశిస్తున్నాం’’ అని పేర్కొంటూ మంత్రి హర్పాల్‌ కాగిత రహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కొత్తగా 26,454 పోస్టులను భర్తీ చేయాలని, 36,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని