ఆయుధ డిపోపై దాడి చేశాం: రష్యా

సెంట్రల్‌ ఉక్రెయిన్‌లోని క్రెమెన్‌చుక్‌ నగరంలో రష్యా క్షిపణుల దాడిలో ధ్వంసమైన షాపింగ్‌ మాల్‌లో మృతుల సంఖ్య 18కు చేరుకుంది. 59 మందికి గాయాలయ్యాయి. 36 మంది కనిపించడం లేదని అధికారులు పేర్కొన్నారు.

Published : 29 Jun 2022 05:57 IST

కీవ్‌/మాస్కో: సెంట్రల్‌ ఉక్రెయిన్‌లోని క్రెమెన్‌చుక్‌ నగరంలో రష్యా క్షిపణుల దాడిలో ధ్వంసమైన షాపింగ్‌ మాల్‌లో మృతుల సంఖ్య 18కు చేరుకుంది. 59 మందికి గాయాలయ్యాయి. 36 మంది కనిపించడం లేదని అధికారులు పేర్కొన్నారు. రష్యా సైన్యం మాత్రం తాము షాపింగ్‌మాల్‌పై దాడి చేయలేదని ప్రకటించింది. అమెరికా, ఐరోపా దేశాల నుంచి తెచ్చుకున్న ఆయుధాలను దాచి ఉంచిన ఆయుధ డిపోపై గురిపెట్టామని పేర్కొంది. డిపోలోని ఆయుధాల కారణంగా పక్కన ఉన్న షాపింగ్‌మాల్‌కు నిప్పంటుకుందని, అయినా ఆ సమయంలో మాల్‌ ఖాళీగా ఉందని పేర్కొంది. మాల్‌పై దాడిని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ తీవ్రంగా ఖండించారు. మాస్కో యుద్ధనేరానికి పాల్పడిందని మండిపడ్డారు. రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ డిమాండ్‌ చేశారు.

బైడెన్‌ భార్య, కుమార్తెపై రష్యా నిషేధం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రాకపై ఇప్పటికే నిషేధం విధించిన రష్యా.. ఇప్పుడు ఆ జాబితాలో బైడెన్‌ భార్య, కుమార్తెను కూడా చేర్చింది.ఈ తాజా జాబితాలో మొత్తం 25 మంది ఉన్నారు. వీరంతా తమ దేశంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదని మాస్కో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని