శాసనకర్తలే ఎందుకు ప్రతిపాదించాలి?

రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులకు కనీసం 50 మంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ప్రతిపాదకులుగా ఉండాలని, మరో 50 మంది మద్దతుదారులుగా ఉండాలని స్పష్టం చేస్తున్న నిబంధనను వ్యతిరేకిస్తూ దిల్లీకి చెందిన బమ్‌బమ్‌

Published : 29 Jun 2022 05:57 IST

రాష్ట్రపతి అభ్యర్థుల అర్హత నిబంధనలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులకు కనీసం 50 మంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ప్రతిపాదకులుగా ఉండాలని, మరో 50 మంది మద్దతుదారులుగా ఉండాలని స్పష్టం చేస్తున్న నిబంధనను వ్యతిరేకిస్తూ దిల్లీకి చెందిన బమ్‌బమ్‌ మహారాజ్‌ నౌహట్టియా అనే వ్యక్తి సుప్రీం కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం-1952లోని మరికొన్ని నిబంధనల రాజ్యాంగబద్ధతనూ అందులో సవాలు చేశారు. రాజ్యాంగబద్ధ పదవులకు జరిగే ఎన్నికలకు సంబంధించిన అర్హతల్లో సమానత్వం ఉండాలని పేర్కొన్నారు. ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరించేలా నిబంధనలు ఉండకూడదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నౌహట్టియా 2007 నుంచి విఫలయత్నం చేస్తున్నారు. ఈ దఫా బరిలో దిగేందుకు తనకు అనుమతినివ్వాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని