Debt: మనదేశం అప్పు ఎంతో తెలుసా?

దేశంపై ఉన్న అప్పు 2022 మార్చి 31 నాటికి రూ.1,33,22,727 కోట్లకు చేరింది. 2021 డిసెంబర్‌ నాటికి రూ.1,28,41,996 కోట్ల మేర ఉన్న రుణభారం మూడు నెలల్లో రూ.4,80,731కోట్ల మేర పెరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ గురువారం విడుదల చేసిన

Updated : 01 Jul 2022 10:23 IST

ఈనాడు, దిల్లీ: దేశంపై ఉన్న అప్పు 2022 మార్చి 31 నాటికి రూ.1,33,22,727 కోట్లకు చేరింది. 2021 డిసెంబర్‌ నాటికి రూ.1,28,41,996 కోట్ల మేర ఉన్న రుణభారం మూడు నెలల్లో రూ.4,80,731కోట్ల మేర పెరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ గురువారం విడుదల చేసిన పబ్లిక్‌ డెట్‌ మేనేజ్‌మెంట్‌ నివేదిక వెల్లడించింది. భారత్‌కున్న అప్పులో అంతర్గత రుణం రూ.1,14,62,343 కోట్ల (86.03%) మేర ఉండగా, విదేశీ రుణం రూ.8,32,409కోట్ల మేర ఉంది. పబ్లిక్‌ అకౌంట్‌ లయబిలిటీస్‌ రూ.10,27,976 కోట్లకు చేరాయి. అంతర్గత రుణ భారంలో 70.02% (రూ.80.26లక్షల కోట్లు) వాటా మార్కెట్‌ రుణాలదే ఉంది. చిన్న పొదుపు మొత్తాలను చూపి తీసుకున్న రుణాలు రూ.18,83,921 కోట్ల మేర ఉన్నాయి. ఈ రుణం గత మూడునెలల కాలంలో 15.42% మేర పెరిగింది. రుణభారం పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం  దీర్ఘకాలిక అప్పులకు ప్రాధాన్యం ఇస్తోంది. దీర్ఘకాలిక రుణాలవల్ల సగటు వార్షిక వడ్డీరేటు తగ్గినా.. రుణం తీర్చాల్సినకాలం అధికంగా ఉంటుంది కాబట్టి సుదీర్ఘకాలం ప్రభుత్వ ఆదాయం వడ్డీలకే వెళ్తుంది. 2015 డిసెంబర్‌ నాటికి రూ.63,03,914 కోట్లమేర ఉన్న భారత ప్రభుత్వ రుణ భారం ఏడేళ్లలో 111.34% పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని