హాంకాంగ్‌ ప్రగతిని ఏదీ ఆపలేదు : జిన్‌పింగ్‌

‘మాతృభూమి ఒడిలోకి తిరిగి వచ్చాక హాంకాంగ్‌ అన్ని రకాల సవాళ్లను అధిగమించి స్థిరంగా ముందుకు సాగుతోంది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కరోనా మహమ్మారి, సామాజిక అశాంతి.. ఏదీ

Published : 02 Jul 2022 06:34 IST

హాంకాంగ్‌: ‘మాతృభూమి ఒడిలోకి తిరిగి వచ్చాక హాంకాంగ్‌ అన్ని రకాల సవాళ్లను అధిగమించి స్థిరంగా ముందుకు సాగుతోంది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కరోనా మహమ్మారి, సామాజిక అశాంతి.. ఏదీ హాంకాంగ్‌ ప్రగతిని అడ్డుకోలేకపోయింది’ అని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ అన్నారు. హాంకాంగ్‌.. బ్రిటిష్‌ వలస పాలన నుంచి చైనా నియంత్రణలోకి వచ్చి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఇక్కడ ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయిదేళ్ల కిందట 2017లో 20వ వార్షికోత్సవం కోసం హాంకాంగ్‌కు విచ్చేసిన షి మళ్లీ ఇపుడు రజతోత్సవానికి వచ్చారు. గురు, శుక్రవారాల్లో జరిగిన అధ్యక్షుడి కార్యక్రమాల్లో పాల్గొన్న వేలాది అతిథులకు రోజువారీ కరోనా పరీక్షలు చేశారు. అసమ్మతిని అణచివేసిన మాజీ భద్రతా అధికారి జాన్‌ లీ హాంకాంగ్‌ కొత్త పాలకుడిగా షి సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. పతాకావిష్కరణ కార్యక్రమానికి హాంకాంగ్‌ కొత్త, పాత పాలకులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని