సీపీఎం కార్యాలయంపై బాంబు దాడి

కేరళలోని తిరువనంతపురంలో సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఏకేజీ సెంటర్‌పై గురువారం అర్ధరాత్రి బాంబు దాడి జరగడం కలకలం సృష్టించింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ

Published : 02 Jul 2022 06:34 IST

కాంగ్రెస్‌ పనేనన్న అధికార పార్టీ

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఏకేజీ సెంటర్‌పై గురువారం అర్ధరాత్రి బాంబు దాడి జరగడం కలకలం సృష్టించింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ దుండగుడు.. కార్యాలయం ప్రహరీ వైపు పేలుడు పదార్థాన్ని విసిరి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్న వేళ ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ దాడి వెనుక కాంగ్రెస్‌ ఉందంటూ అధికార సీపీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ ఖండించింది. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం తమ పార్టీ విధానం కాదని పేర్కొంది. మరోవైపు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ శుక్రవారం ఏకేజీ సెంటర్‌కు చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. దాడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం, కాంగ్రెస్‌ల కార్యాలయాలకు భద్రత పెంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని