రక్తం లేకుండానే యాంటీబాడీ పరీక్ష

కొవిడ్‌ మహమ్మారి నిర్ధారణ ప్రక్రియను మరింత వేగంగా, విశ్వసనీయమైనదిగా మార్చే దిశగా జపాన్‌ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. రక్త నమూనాలు లేకుండానే ఈ వ్యాధిని కచ్చితత్వంతో

Published : 02 Jul 2022 06:34 IST

టోక్యో: కొవిడ్‌ మహమ్మారి నిర్ధారణ ప్రక్రియను మరింత వేగంగా, విశ్వసనీయమైనదిగా మార్చే దిశగా జపాన్‌ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. రక్త నమూనాలు లేకుండానే ఈ వ్యాధిని కచ్చితత్వంతో గుర్తించే సరికొత్త యాంటీబాడీ ఆధారిత పరీక్షను అభివృద్ధి చేశారు. రక్తంలో సార్స్‌-కొవ్‌-2 సంబంధిత ప్రత్యేక యాంటీబాడీలను గుర్తించడం- కరోనా నిర్ధారణకు అందుబాటులో ఉన్న విశ్వసనీయ పరీక్షా విధానాల్లో ఒకటి. అయితే ఇందుకోసం రక్త నమూనాను సేకరించే ప్రక్రియ వ్యక్తులకు నొప్పి కలిగిస్తుంటుంది. పరీక్షా ఫలితం వచ్చేందుకు 20 నిమిషాల వరకు సమయం పడుతుంటుంది. దానికి భిన్నంగా.. మానవ చర్మంలో ఎపిడెర్మిస్‌, డెర్మిస్‌ పొరల మధ్య ఉండే ఇంటర్‌స్టిషియల్‌ ద్రావణం (ఐఎస్‌ఎఫ్‌)లో యాంటీబాడీలను కనిపెట్టే విధానాన్ని శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. ఈ ప్రక్రియలో ఉపయోగపడే సూక్ష్మసూదులు (వీటితో ఐఎస్‌ఎఫ్‌ సేకరిస్తే నొప్పి తెలియదు), పేపర్‌ ఆధారిత ఇమ్యూనోఅస్సే బయోసెన్సర్‌ను తయారుచేశారు. రక్తంతో పోలిస్తే ఐఎస్‌ఎఫ్‌లో యాంటీబాడీ స్థాయులు 15-25% వరకే ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే వ్యాధి నిర్ధారణకు అవి సరిపోతాయని స్పష్టం చేశారు. కేవలం 3 నిమిషాల్లో పరీక్షా ఫలితం వస్తుందని వెల్లడించారు. భవిష్యత్తులో పలు ఇతర వ్యాధుల నిర్ధారణకూ ఈ విధానం దోహదపడే అవకాశముందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని