Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్‌ ఎంతో తెలుసా?

బ్రిటన్‌కు చెందిన చెందిన లారా యంగ్‌ అనే ఓ మహిళ తన భర్తను అద్దెకిస్తోంది. ఇందుకోసం ‘రెంట్‌ మై హ్యాండీ హస్బెండ్‌’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ ప్రారంభించింది. చిన్నచిన్న పనులు చేసిపెట్టేందుకు తన భర్తను

Published : 03 Jul 2022 08:05 IST

బ్రిటన్‌కు చెందిన చెందిన లారా యంగ్‌ అనే ఓ మహిళ తన భర్తను అద్దెకిస్తోంది. ఇందుకోసం ‘రెంట్‌ మై హ్యాండీ హస్బెండ్‌’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ ప్రారంభించింది. చిన్నచిన్న పనులు చేసిపెట్టేందుకు తన భర్తను అద్దెకు ఇస్తున్నట్లు మహిళ తెలిపింది. ఇందుకోసం రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. లారా భర్త జేమ్స్‌.. ఇంటి పనుల్లో దిట్ట. చిన్నచిన్న పనులను అలవోకగా పూర్తి చేస్తాడు. పెయింటింగ్‌, అలంకరణ, టైల్స్‌, కార్పెట్లు ఏర్పాటు చేయడం వంటి పనులను నేర్పుతో చేస్తాడు. బకింగ్‌హమ్‌షైర్‌లోని తన ఇంట్లో పనికి రాని వస్తువులతో  డైనింగ్‌ టేబుల్‌ తయారు చేశాడు. సొంతంగా బెడ్‌లను రూపొందిస్తున్నాడు. అందుకే అతడి నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నట్లు లారా పేర్కొన్నారు. ‘‘టీవీని గోడకు అమర్చడం, పెయింటింగ్‌ వేయడం ఇంటిని శుభ్రం చేయడం వంటి పనులకు 35 పౌండ్లను (సుమారు రూ.3,340) ఛార్జీలుగా వసూలు చేస్తున్నాం. దివ్యాంగులు, 65ఏళ్లు పైబడిన వారికి రాయితీలు కూడా ఇస్తున్నాం’’ అని లారా చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని