జవాన్లు, పోలీసుల ఫైటింగ్‌

ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌ జాతీయ రహదారిపై గంటకుపైగా ఆర్మీ సిబ్బంది, పోలీసులు మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. సరకులతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు.. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు

Published : 03 Jul 2022 06:39 IST

ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌ జాతీయ రహదారిపై గంటకుపైగా ఆర్మీ సిబ్బంది, పోలీసులు మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. సరకులతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు.. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు కారును ఢీకొట్టడం కారణంగా వివాదం మొదలైంది. ఎస్‌ఐ అనిల్‌.. కోర్టుకు వెళ్లి వస్తున్న సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్మీ ట్రక్కు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. దీంతో ఎస్‌ఐ.. ఆర్మీ సిబ్బందిని ట్రక్కుతో సహా పోలీస్‌స్టేషన్‌కు రమ్మని చెప్పడం వల్ల ఇరుపక్షాల మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో ఒక్కసారిగా ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు.. జవాన్లకు మద్దతుగా నినాదాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని