భారత సాగు సబ్సిడీలతో మా రైతులకు నష్టమే

భారతదేశం అనుసరిస్తున్న విధానాలు అంతర్జాతీయ వాణిజ్యంలో అపశ్రుతులు సృష్టిస్తూ, అమెరికన్‌ రైతులు, పశువుల పెంపకందారులకు నష్టం కలిగిస్తున్నాయని దాదాపు 12 మంది అమెరికా

Published : 03 Jul 2022 06:39 IST

అమెరికా కాంగ్రెస్‌ సభ్యుల అక్కసు

వాషింగ్టన్‌: భారతదేశం అనుసరిస్తున్న విధానాలు అంతర్జాతీయ వాణిజ్యంలో అపశ్రుతులు సృష్టిస్తూ, అమెరికన్‌ రైతులు, పశువుల పెంపకందారులకు నష్టం కలిగిస్తున్నాయని దాదాపు 12 మంది అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్‌) సభ్యులు అక్కసు వెళ్లగక్కారు. ఈ విధానాల గురించి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వేదికగా చర్చించడానికి భారత్‌కు అధికారికంగా ప్రతిపాదించాలని వారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. ప్రస్తుత డబ్ల్యూటీఓ నిబంధనలు వ్యవసాయ, వ్యాపార సరకుల ఉత్పత్తి విలువలో 10 శాతాన్ని సబ్సిడీగా అందించడానికి ప్రభుత్వాలను అనుమతిస్తున్నాయి. కానీ, భారత ప్రభుత్వం బియ్యం, గోధుమలతో సహా అనేక సరకుల ఉత్పత్తి విలువలో 50 శాతానికి పైగానే సబ్సిడీ ఇస్తోందని అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల ధరలు తగ్గిపోయి వరి, గోధుమ ఉత్పత్తి పడిపోయిందని,, అది అమెరికన్‌ రైతులను దెబ్బతీస్తోందని ఆరోపించారు. బైడెన్‌ సర్కారు ఈ సమస్యను తొలగించి అమెరికన్‌ వ్యవసాయాన్ని సుస్థిరంగా మార్చి ప్రపంచంలో ఆహార కొరతను తీర్చడంతో పాటు ధరల కట్టడికి బాట వేయాలని వారు కోరారు. భారత్‌ మాత్రం రైతులను ఆదుకోవడానికీ సబ్సిడీ విధానాన్ని కొనసాగిస్తూనే ఉంటానని స్పష్టం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని