నేపాల్‌కు 75 అంబులెన్సులు, 17 బడి బస్సులు

పొరుగు దేశం నేపాల్‌కు 75 అంబులెన్సులు, 17 పాఠశాల బస్సులను భారత్‌ బహుమతిగా అందజేసింది. ఇరు దేశాల మధ్య బలమైన సుదీర్ఘ సంబంధాలను నెలకొల్పేందుకు ఈ చర్య

Published : 04 Jul 2022 06:17 IST

పొరుగు దేశానికి భారత్‌ కానుక

కాఠ్‌మాండూ: పొరుగు దేశం నేపాల్‌కు 75 అంబులెన్సులు, 17 పాఠశాల బస్సులను భారత్‌ బహుమతిగా అందజేసింది. ఇరు దేశాల మధ్య బలమైన సుదీర్ఘ సంబంధాలను నెలకొల్పేందుకు ఈ చర్య దోహదపడుతుందని కొత్తగా నియమితులైన నేపాల్‌లోని భారత రాయబారి నవీన్‌ శ్రీవాస్తవ తెలిపారు. నేపాల్‌కు వైద్య, ఆరోగ్య రంగాల్లో మౌలిక సదుపాయాల బలోపేతానికి  సహకరించనున్నట్లు వెల్లడించారు. నేపాల్‌ విద్య, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దేవేంద్ర పాడెల్‌ సమక్షంలో ఈ వాహనాల తాళాలను నవీన్‌ శ్రీవాస్తవ ఆదివారం అందజేశారు. 75 ఏళ్ల భారత స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 75 అంబులెన్సులు ఇచ్చినట్లు శ్రీవాస్తవ తెలిపారు. నేపాల్‌లో భారత్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం హర్షణీయమని మంత్రి దేవేంద్ర పాడెల్‌ అన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భారత్‌ అందించిన వాహనాలను ప్రభుత్వ విభాగాలకు, ఎన్జీవోలకు అందజేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని