కెమిస్ట్‌ హత్య.. సూత్రధారి ఇర్ఫాన్‌కు 7 వరకు రిమాండ్‌

మహారాష్ట్రలోని అమరావతిలో కెమిస్ట్‌ ఉమేశ్‌ కొల్హే హత్య ఘటనలో ప్రధాన సూత్రధారి షేక్‌ ఇర్ఫాన్‌ షేక్‌ రహీమ్‌ అలియాస్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌ (35)కు ఆదివారం స్థానిక న్యాయస్థానం ఈ నెల 7 వరకు

Published : 04 Jul 2022 06:17 IST

అమరావతి: మహారాష్ట్రలోని అమరావతిలో కెమిస్ట్‌ ఉమేశ్‌ కొల్హే హత్య ఘటనలో ప్రధాన సూత్రధారి షేక్‌ ఇర్ఫాన్‌ షేక్‌ రహీమ్‌ అలియాస్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌ (35)కు ఆదివారం స్థానిక న్యాయస్థానం ఈ నెల 7 వరకు పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో మరో ఆరుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇర్ఫాన్‌ డైరెక్టరుగా ఉన్న ‘రాహ్‌బర్‌’ అనే స్వచ్ఛందసంస్థ బ్యాంక్‌ ఖాతాలపైనా విచారణ ప్రారంభమైంది. మహమ్మద్‌ ప్రవక్తకు వ్యతిరేకంగా బాజపా బహిష్కృత నేత నుపుర్‌శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా పోస్టు చేసినందుకు ఉమేశ్‌ను గత నెల 21న హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్హయ్య లాల్‌ను కూడా నుపుర్‌ మద్దతుగా వీడియో షేర్‌ చేసినందుకు హత్య చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కన్హయ్య కిరాతక హత్యను నిరసిస్తూ ఆదివారం రాజస్థాన్‌లోని జైపుర్‌లో ‘సర్వ హిందూ సమాజ్‌’ పేరిట భారీ ర్యాలీ జరిగింది. ఇందులో ఆరెస్సెస్‌, వీహెచ్‌పీ, ఇతర హిందూ సంస్థలు పాల్గొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని