గోద్రా నిందితుడు రఫీక్‌ భతూక్‌కు జీవిత ఖైదు

గుజరాత్‌లోని గోద్రా రైలు దహనం కేసులో కీలక నిందితుడైన రఫీక్‌ భతూక్‌కు న్యాయస్థానం జైవిత ఖైదు విధించింది. ఈ మేరకు గోద్రా అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి శనివారం తీర్పు వెలువరించారు.

Published : 04 Jul 2022 06:17 IST

గోద్రా: గుజరాత్‌లోని గోద్రా రైలు దహనం కేసులో కీలక నిందితుడైన రఫీక్‌ భతూక్‌కు న్యాయస్థానం జైవిత ఖైదు విధించింది. ఈ మేరకు గోద్రా అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి శనివారం తీర్పు వెలువరించారు. 2021 ఫిబ్రవరిలో రఫీక్‌ అరెస్టు అయ్యాడు. 2002 ఫిబ్రవరి 27న కరసేవకులతో అయోధ్య నుంచి వస్తున్న రైలుకు గోద్రా స్టేషన్‌లో దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 59 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జరిగిన అనంతరం గుజరాత్‌లో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇందులో 1,200 మందికి పైగా మృతి చెందారు. ఈ కేసులో దోషిగా శిక్షపడిన రఫీక్‌ భతూక్‌ 35వ నిందితుడిగా ఉన్నారు. విచారణ పుర్తయిన అనంతరం తాజాగా రఫీక్‌కు అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని