ప్రవాసుల డాలర్లతో చమురు దిగుమతి
శ్రీలంక మంత్రి విజేశేకర
కొలంబో: విదేశాల్లోని ప్రవాస శ్రీలంక జాతీయులు స్వదేశానికి హవాలా మార్గంలో డబ్బు పంపడం మానేసి బ్యాంకుల ద్వారా పంపాలని ఇంధన శాఖ మంత్రి కంచన విజేశేకర విజ్ఞప్తి చేశారు. ప్రవాసులు పంపే డాలర్లతో ప్రభుత్వం చమురు, గ్యాస్‌లను దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. విదేశాల్లో పని చేస్తున్న 20 లక్షలమంది శ్రీలంక పౌరులు స్వకుటుంబాలకు 2021 ప్రథమార్ధంలో బ్యాంకుల ద్వారా 280 కోట్ల డాలర్లు పంపగా, 2022లో ఇదే కాలంలో 130 కోట్ల డాలర్లే పంపారు. సాధారణంగా నెలకు 60 కోట్ల డాలర్ల చొప్పున పంపే ప్రవాసులు ఈ జూన్ లో 31.8 కోట్ల డాలర్లు మాత్రమే పంపారని విజేశేకర వెల్లడించారు. ఖజానాలో విదేశీమారక ద్రవ్యమంతా ఖాళీ అయిపోవడంతో విదేశాల నుంచి తీసుకున్న 5100 కోట్ల డాలర్ల రుణాలను శ్రీలంక తిరిగి తీర్చలేకపోతోంది. అందులో 2500 కోట్ల డాలర్లను 2026కల్లా తీర్చాలి. వాటిలో ఈ ఏడాది తీర్చాల్సిన 700 కోట్ల డాలర్ల కిస్తీలను చెల్లించలేనని లంక ప్రభుత్వ చేతులెత్తేసింది. ఇంధన దిగుమతులకు లంక చేతిలో డాలర్లే లేవు. భారతదేశం రుణ సదుపాయం కింద ఇంధనం సరఫరా చేసి కొంతవరకు ఆదుకుంది. మరోవైపు.. ఇంధన కొరత వల్ల విద్యాసంస్థలు రెండు వారాల నుంచి మూతబడిపోయాయి. ప్రభుత్వోద్యోగులు ఇళ్ల నుంచి పనిచేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
-
India News
Chidambaram: ‘ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటోంది’
-
World News
Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
-
Sports News
IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
-
India News
US: భారతీయ మహిళ బలవన్మరణం.. స్పందించిన న్యూయార్క్ కాన్సులేట్ జనరల్
-
General News
Hair Fall: మీ జుట్టు రాలిపోతుందా..! ఎందుకో తెలుసా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Hair Fall: మీ జుట్టు రాలిపోతుందా..! ఎందుకో తెలుసా..?
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
- Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- US: భారతీయ మహిళ బలవన్మరణం.. స్పందించిన న్యూయార్క్ కాన్సులేట్ జనరల్
- Indain Navy: భారత జలాల్లోకి పాక్ యుద్ధనౌక.. వెనక్కి తరిమిన కోస్ట్‌గార్డ్ ‘డోర్నియర్’
- INDw vs AUSw : కామన్వెల్త్ ఫైనల్.. ఆసీస్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు
- Nithiin: అభిమానుల కోసం మరో 20 ఏళ్లైనా కష్టపడతా: నితిన్
- Rishi Sunak: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ ఫిర్యాదు ఏంటో తెలుసా..?