- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
మేం రక్షణ కల్పించినా అరెస్టు చేయడమేంటి?
మహారాష్ట్రలో పరిణామంపై సుప్రీం విస్మయం
దిల్లీ: మహారాష్ట్రలో ఓ వ్యక్తికి మధ్యంతర ఉత్తర్వులతో తాము రక్షణ కల్పించినప్పటికీ.. పోలీసులు అరెస్టు చేయడంపై సుప్రీం కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వేరే కేసుల్లో నిందితుడిగా లేకపోతే.. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని సోమవారం ఆదేశించింది. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఓ వ్యక్తిపై మోసం సహా పలు అభియోగాలపై కేసు నమోదైంది. ముందస్తు బెయిలు కోసం ఆయన గత ఏడాది సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆరు వారాల్లోగా స్పందన దాఖలు చేసేలా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన కోర్టు.. ఆ వ్యక్తిని అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే- పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంటు సంపాదించి నిందితుణ్ని అరెస్టు చేశారు. తర్వాత ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు. ఈ పరిణామంపై నిందితుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన సెలవుకాల ధర్మాసనం విచారణ జరిపింది. అరెస్టు నుంచి తాము కల్పించిన రక్షణ ఆరు వారాలకే ముగిసినట్లు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్‌క్లాస్ ఈ ఏడాది జూన్ 24న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని గుర్తించి ఆశ్చర్యం, అసంతృప్తి వ్యక్తం చేసింది. మేజిస్ట్రేట్ అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంటు పొందడం వారి సత్ప్రవర్తనపై ప్రశ్నలు రేకెత్తిస్తోందనీ వ్యాఖ్యానించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
-
World News
Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
-
India News
Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
-
Sports News
IND vs ZIM : జింబాబ్వే వంటి జట్లతో ఆడటం.. ప్రపంచ క్రికెట్‌కు మంచిది!
-
Movies News
హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?
- Offbeat: 99ఏళ్ల బామ్మ.. 100వ మునిమనవడిని కలిసిన వేళ!
- Kejriwal: ‘ఆప్‌ని గెలిపిస్తే..’ గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ హామీలు
- Ponniyin Selvan: ఆ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి తమిళ సినిమా!
- IND vs ZIM : జింబాబ్వే వంటి జట్లతో ఆడటం.. ప్రపంచ క్రికెట్‌కు మంచిది!
- China: జననాల రేటుపై చైనా కలవరం.. యువ జంటలకు సబ్సిడీలు, పన్ను రాయితీలు..