షికాగో కవాతుపై 70 రౌండ్లకు పైగా కాల్పులు

అమెరికాలో షికాగో శివార్లలోని హైలాండ్‌ పార్క్‌ వద్ద స్వాతంత్య్ర దినోత్సవ కవాతుపై సోమవారం జరిగిన కాల్పులకు సంబంధించి తాజాగా కీలక విషయాలు బయటికొచ్చాయి. పోలీసులు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. దుండగుడు ఓ ఎత్తయిన వాణిజ్య

Published : 06 Jul 2022 06:04 IST

మహిళా వేషధారణలో తప్పించుకున్న దుండగుడు

షికాగో: అమెరికాలో షికాగో శివార్లలోని హైలాండ్‌ పార్క్‌ వద్ద స్వాతంత్య్ర దినోత్సవ కవాతుపై సోమవారం జరిగిన కాల్పులకు సంబంధించి తాజాగా కీలక విషయాలు బయటికొచ్చాయి. పోలీసులు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. దుండగుడు ఓ ఎత్తయిన వాణిజ్య భవనం పైనుంచి ఏఆర్‌-15 తరహా శక్తిమంతమైన రైఫిల్‌తో 70 రౌండ్లకు పైగా కాల్పులకు తెగబడ్డాడు. అక్కడున్నవారు తూటాల శబ్దాన్ని తొలుత బాణసంచా పేలుళ్లుగా పొరబడ్డారు. తర్వాత అసలు విషయం గ్రహించి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. కాల్పుల అనంతరం దుండగుడు మహిళల తరహా వస్త్రాలు ధరించి.. ప్రాణభయంతో పరుగులు పెడుతున్న జనం మధ్యలో కలిసిపోయాడు. దీంతో అతణ్ని పోలీసులు వెంటనే అరెస్టు చేయలేకపోయారు. ఎట్టకేలకు సోమవారం రాత్రి అతడు చిక్కాడు. కాల్పులకు జాతి, మత వివక్షలే కారణమని చెప్పేందుకు ప్రస్తుతానికి స్పష్టమైన సాక్ష్యాధారాలేవీ లభించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని