Hacking: ఆన్లైన్ మార్కెట్లో 100 కోట్ల మంది డేటా!
2 లక్షల డాలర్లకు అమ్మజూపుతున్న హ్యాకింగ్ వేదిక
హాంకాంగ్: చైనాలోని షాంఘై పోలీసుశాఖ సమాచార నిధి (డేటా బేస్) నుంచి 100 కోట్ల మంది చైనీయుల వివరాలను తస్కరించామని ‘బ్రీచ్ ఫోరమ్స్’ అనే ఆన్లైన్ హ్యాకింగ్ వేదిక ప్రకటించింది. ఆసక్తిగలవారికి ఈ 24 టెరాబైట్ల డేటాను 2 లక్షల డాలర్ల (రూ.1.58 కోట్లు) విలువైన 10 బిట్కాయిన్ల ధరకు అమ్మజూపింది. గత వారం అపహరించిన ఈ డేటాలో వ్యక్తుల పేర్లు, చిరునామాలు, మొబైల్ నంబర్లు, జాతీయ గుర్తింపు సంఖ్యలు, పోలీసు కేసుల వివరాలు ఉన్నాయి. ఈ డేటా నిజమైనదో.. కాదో తెలుపడానికి షాంఘై పోలీసులు నిరాకరించారు. డేటా లీకు గురించి వైబో వంటి చైనీస్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగింది. అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ సంభాషణలను సెన్సార్ చేశారు. డేటా చౌర్యం నిజమే అయితే.. వ్యక్తుల ఆంతరంగిక వివరాలు బరితెగించి మరీ బయటి ప్రపంచానికి చాటింపు వేసినట్లే. చరిత్రలో ఇదే అతిపెద్ద డేటా చౌర్యం అవుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Har Ghar Tiranga: ఇంటింటా హర్ ఘర్ తిరంగా.. సతీమణితో కలిసి జెండా ఎగరవేసిన అమిత్ షా
-
Movies News
Vikram: నిజంగా నేనే వచ్చా.. డూపు కాదు: విక్రమ్
-
General News
Chandrababu: హర్ ఘర్ తిరంగా.. ఓ పవిత్రమైన కార్యక్రమం: చంద్రబాబు
-
Movies News
F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
-
World News
Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
-
Sports News
IND vs PAK: భారత్ vs పాక్ మ్యాచ్‌పై రికీ పాంటింగ్ జోస్యం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- Hyderabad: మహిళ చెర నుంచి నా కుమారుడిని కాపాడండి.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి
- Crime News: సినిమా చూసి.. మూఢవిశ్వాసంతో బలవన్మరణం
- Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల పెళ్లి సందడి.. టీజర్ చూశారా!