Published : 06 Jul 2022 06:04 IST

రాజ్యాంగంపై కేరళ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

తిరువనంతపురం: భారత రాజ్యాంగంపై కేరళ మంత్రి సాజి చెరియన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దోపిడీని సమర్థిస్తూ, దేశ ప్రజలను మోసం చేసే విధంగా రాజ్యాంగాన్ని రాశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన ప్రతిపక్షాలు.. మంత్రిని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ వాదనను అధికార సీపీఎం తోసిపుచ్చింది. పతనంతిట్టా జిల్లా మల్లపల్లిలో జరిగిన రాజకీయ కార్యక్రమానికి హాజరైన చెరియన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మికులు నిరసన వ్యక్తం చేసేందుకు దేశం అనుమతించదని.. కానీ వారిపై దోపిడీ చేసే వారిని ప్రోత్సహిస్తోందని మంత్రి విమర్శించారు. ఈ కారణంతోనే దేశంలో కార్పొరేట్‌ రంగం విస్తరిస్తూ.. మిలీనియర్ల సంఖ్య పెరిగిపోతోందని ఆరోపించారు. బ్రిటిష్‌ వారు సంకలనం చేసిన రాజ్యాంగాన్ని ఓ భారతీయుడు రాశారని.. దానినే 75 ఏళ్లుగా అమలు చేస్తున్నామన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటివి వాటిలో పొందుపరిచారని చెప్పారు. దేశంలో ఎవరు దీనికి విరుద్ధంగా చెప్పినా తాను అంగీకరించబోనని మంత్రి చెరియన్‌ స్పష్టం చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌, భాజపా తీవ్ర అభ్యంతరం తెలిపాయి. మంత్రిని వెంటనే కేబినెట్‌ నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను అధికార సీపీఎం తోసిపుచ్చింది. పొరపాటున నోరు జారారని వ్యాఖ్యానించింది. దీనిపై మంత్రి వివరణ ఇస్తూ.. తన వ్యాఖ్యలను మీడియాలో వక్రీకరించి ప్రసారం చేశారని ఆరోపించారు.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని