Published : 07 Jul 2022 06:07 IST

మాతృభాషతో ఆనందం, ఆత్మవిశ్వాసం

అస్సామీ పత్రిక ‘అగ్రదూత్‌’ స్వర్ణోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ వెల్లడి

గువాహటి: స్వాతంత్య్రానికి ముందు మన దేశంలోని ప్రాంతీయ భాషలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని, వైజ్ఞానిక సంపదకు ప్రజలు దూరమయ్యారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీనివల్ల నవీన ఆవిష్కరణలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. 21వ శతాబ్ధిలో డిజిటల్‌ సాంకేతికతను అందిపుచ్చుకున్న భారత్‌ పురోగామి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అస్సామీ పత్రిక ‘అగ్రదూత్‌’ స్వర్ణోత్సవాలను ప్రధాని మోదీ బుధవారం వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ..‘మాతృభాష ఎల్లవేళలా ఆనందాన్నిస్తుంది. అందరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంద’ని తెలిపారు. ప్రాంతీయ భాషల్లో విజ్ఞాన సర్వస్వాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందు కోసం ‘నేషనల్‌ లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌’ను  ప్రారంభించినట్లు చెప్పారు. జాతీయ నూతన విద్యా విధానంలో మాతృభాషలకు ప్రాధాన్యం కల్పిస్తున్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఇంటర్నెట్‌తో దేశ ప్రజలందరినీ అనుసంధానించే యత్నం కొనసాగుతుందంటూ డిజిటల్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రస్తావించారు.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని