రెండేళ్లలో ‘ఎండెమిక్‌’ దశకు కొవిడ్‌!

అమెరికాలో కొవిడ్‌ మహమ్మారి సాధారణంగా ఎక్కువ మందికి వచ్చిపోయే వ్యాధి (ఎండెమిక్‌) దశకు చేరుకోవడానికి కనీసం మరో రెండేళ్లు పట్టొచ్చని తాజా అధ్యయనం ఒకటి తేల్చిచెప్పింది. ఈమేరకు ఎలుకల మీద నిర్వహించిన

Published : 07 Jul 2022 06:15 IST

వాషింగ్టన్‌: అమెరికాలో కొవిడ్‌ మహమ్మారి సాధారణంగా ఎక్కువ మందికి వచ్చిపోయే వ్యాధి (ఎండెమిక్‌) దశకు చేరుకోవడానికి కనీసం మరో రెండేళ్లు పట్టొచ్చని తాజా అధ్యయనం ఒకటి తేల్చిచెప్పింది. ఈమేరకు ఎలుకల మీద నిర్వహించిన ప్రయోగాల ద్వారా నిర్ధారణకు వచ్చారు. కొవిడ్‌-19 ఎప్పుడు, ఎలా ఎండెమిక్‌ దశకు చేరుకుంటుందనే విషయంపై మరింత అవగాహనకు వచ్చేందుకు అమెరికాలోని యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో పరిశోధకులు ఈ ప్రయోగాలు చేపట్టారు. సాధారణ జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు ఇప్పటికే ఎండెమిక్‌గా మారాయి. అంటే ప్రతిఒక్కరూ ఎప్పుడైనా వీటి బారినపడొచ్చు. అలాగే ప్రత్యేకించి వీటితో ముప్పు కూడా అంతగా ఉండదు. కాగా ఎలుకల్లో కరోనా వైరస్‌ రీఇన్‌ఫెక్షన్‌ రేటుకు సంబంధించి సమాచారాన్ని సేకరించడం ద్వారా పరిశోధనకర్తలు కొవిడ్‌-19 స్వభావాన్ని అంచనా వేశారు. ఈమేరకు జంతువులు లేదా మనుషులు ఒకసారి కరోనా బారిన పడినా.. వ్యాక్సిన్‌ పొందినా.. తిరిగి మళ్లీ కొవిడ్‌కు గురయ్యే అవకాశం ఉంటుందని యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌, అధ్యయనకర్త కరోలినే జైస్‌ పేర్కొన్నారు. మొదట్లో చక్కగా ఉండే రోగనిరోధక శక్తి ఆపై క్రమేపీ క్షీణించడమే దీనికి కారణమని తెలిపారు. అయితే వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా లేదా కొందరిలో ఉండే స్వతసిద్ధమైన రోగనిరోధక శక్తి ద్వారా ప్రజల్లో విస్తృతమైన రోగనిరోధక శక్తి సమకూరుతుంది. తద్వారా వైరస్‌ ఎండెమిక్‌ స్థాయికి చేరుకుంటుందని అధ్యయనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని