స్టాన్ స్వామి మరణంపై విచారణ జరపాలి
అమెరికన్ పార్లమెంటులో తీర్మానం ప్రతిపాదన
న్యూయార్క్: భారత్‌కు చెందిన మానవహక్కుల ఉద్యమకారుడు, జెస్యూట్ క్రైస్తవ అర్చకుడు స్టాన్ స్వామి మరణంపై స్వతంత్ర విచారణ జరపాలంటూ అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) దిగువ సభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. పాలక డెమోక్రటిక్ పార్టీ ఎంపీ హువాన్ వార్గస్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి మరో ఇద్దరు ఎంపీలు సహ ప్రాయోజకులుగా వ్యవహరించారు. 84 ఏళ్ల స్టాన్ స్వామి పోలీసు కస్టడీలో మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్వామి సంస్మరణార్థం మంగళవారం జరిగిన వెబినార్‌లో వార్గస్ మాట్లాడారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, ఐరోపా సమాఖ్య (ఈయూ), ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు వెబినార్‌లో ప్రసంగించారు. ఈ వెబ్ గోష్ఠికి హిందూస్ ఫర్ హ్యూమన్‌రైట్స్, ఆదివాసీ లైవ్స్ మ్యాటర్, దళిత్ సాలిడారిటీ ఫోరం, ఇండియన్ అమెరికన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ నార్త్ అమెరికా, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ తదితర సంస్థలు సహ నిర్వాహకులుగా వ్యవహరించాయి. స్టాన్ స్వామికి జైలులో గుండెపోటు రావడంతో, ఆ మరుసటిరోజు అంటే నిరుడు మే 29న ముంబయిలోని ఒక ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే గుండె ఆగిపోయిన స్వామికి వెంటిలేటరు మీద శ్వాస ఏర్పాటుచేసినా ప్రాణాలు దక్కలేదు. ఆయనకు పార్కిన్సన్ వ్యాధితోపాటు ఇతర రుగ్మతలూ ఉన్నాయి. పోలీసు కస్టడీలో స్టాన్ స్వామిపై బలప్రయోగం జరిగిందనీ, ఆయన ఆరోగ్యస్థితిని ఘోరంగా నిర్లక్ష్యం చేశారనీ, ఇదంతా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోందని వార్గస్ వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Hyderabad: ఆ ట్వీట్‌తో దిల్లీ నుంచి హైదరాబాద్‌కు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
-
World News
Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
-
Sports News
T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
-
Viral-videos News
Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Gali Janardhana Reddy: ‘గాలి’ అడిగితే కాదంటామా!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
- Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!