ప్రపంచయుద్ధం నాటి బాంబు పేలి ముగ్గురికి గాయాలు

జర్మనీలోని మ్యూనిచ్‌ నగరంలో బుధవారం రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు

Published : 02 Dec 2021 12:02 IST

బెర్లిన్‌: జర్మనీలోని మ్యూనిచ్‌ నగరంలో బుధవారం రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. రైల్వే స్టేషన్‌కు సమీపంలో జరుగుతున్న ఈ ఓ నిర్మాణ స్థలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పొగలు వ్యాపించడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 76 ఏళ్లు పూర్తయినా ఇంకా జర్మనీలో అక్కడక్కడ బాంబులు దొరుకుతూనే ఉంటున్నాయి. మ్యూనిచ్‌ నగరంలో గతంలో క్షుణ్ణంగా పరిశీలన జరిపినప్పటికీ ఇది ఎందుకు దొరకలేదన్నదానిపై అధికారులు దృష్టి సారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని