కేసులు పెరుగుతున్నాయ్‌.. జాగ్రత్త!

కొవిడ్‌ కేసులు, వారపు పాజిటివిటీ రేటు, మరణాలు పెరుగుతుండటంతో 5 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతాన్ని కేంద్రం అప్రమత్తం చేసింది. ఈమేరకు కరోనా కట్టడికి నిర్దుష్టమైన చర్యలు చేపట్టాలంటూ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, మిజోరం, జమ్మూ-కశ్మీర్‌లకు కేంద్ర

Updated : 05 Dec 2021 05:38 IST

 5 రాష్ట్రాలకు కేంద్రం లేఖ

దిల్లీ: కొవిడ్‌ కేసులు, వారపు పాజిటివిటీ రేటు, మరణాలు పెరుగుతుండటంతో 5 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతాన్ని కేంద్రం అప్రమత్తం చేసింది. ఈమేరకు కరోనా కట్టడికి నిర్దుష్టమైన చర్యలు చేపట్టాలంటూ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, మిజోరం, జమ్మూ-కశ్మీర్‌లకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి శనివారం లేఖ రాశారు. ఆయా రాష్ట్రాల్లో కేసులు, పాజిటివిటీ రేటు, మరణాలు ఏయే ప్రాంతాల్లో.. ఏ రీతిలో పెరుగుతున్నాయో గణాంకాలతో వివరించారు. ‘పరీక్షలు జరపడం, కేసులు గుర్తించడం, చికిత్స అందించడం, వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ నిబంధనలు పాటించడం’ అనే వ్యూహాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ నవంబరు 27న రాసిన లేఖను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు.

లేఖలో పేర్కొన్న విషయాలివీ..

ఒక్క కేరళలోనే 1,71,521 కేసులు బయటపడ్డాయి. అలాగే నెల రోజుల్లో తమిళనాడులో 23,764; మిజోరంలో 12,562; కర్ణాటకలో 8,073; ఒడిశాలో 7,445; జమ్మూ-కశ్మీర్‌లో 4,806 కొత్త కేసులు నమోదయ్యాయి.

కేరళలో 14 జిల్లాలకు గాను 13 చోట్ల వారపు కేసులు పెరిగాయి. వారపు పాజిటివిటీ రేటు తిరువనంతపురం, వయనాడ్‌, కోజికోడ్‌, కొట్టాయం జిల్లాల్లో 10%కి పైగా.. 9 జిల్లాల్లో 5 నుంచి 10% మధ్య నమోదైంది. గత వారంలో (డిసెంబరు 3 నాటికి) ఈ రాష్ట్రంలో 2,118 కొవిడ్‌ మరణాలు సంభవించాయి. త్రిశూర్‌, మలప్పురం, కోజికోడ్‌, కొల్లాం జిల్లాల్లో వారపు మరణాల సంఖ్య పెరిగింది.

* కర్ణాటకలోనూ గత వారం (అంతకుముందు వారంతో పోలిస్తే) కేసులు, మరణాలు పెరిగాయి. బెంగళూరు అర్బన్‌లో మరణాలు, కేసుల్లోను.. టముకూరు, ధార్వాడ్‌, మైసూర్‌లలో కేసుల్లో పెరుగుదల నమోదైంది.

* తమిళనాడులో వెల్లూర్‌, తిరువల్లూర్‌, చెన్నైలలో వారపు కేసులు పెరిగాయి. ఒడిశాలో ఖుర్దా, ఢెంకనాల్‌, కాంధమాల్‌, నవరంగ్‌పుర్‌, కెందుజ్‌హర్‌, అంగుల్‌, బొలంఘీర్‌ జిల్లాల్లో కేసుల పెరుగుదల నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని