రెండో పెళ్లికి మ్యారేజ్‌ బ్యూరో నిరాకరణ.. ఆత్మాహుతికి 64 ఏళ్ల వృద్ధుడి యత్నం!

రెండో పెళ్లి కోసం సంబంధం చూసేందుకు ఓ మ్యారేజ్‌ బ్యూరో నిరాకరించిందని దారుణానికి ఒడిగట్టాడో వృద్ధుడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని...

Published : 19 Jan 2022 10:32 IST

ఐలాండ్‌: రెండో పెళ్లి కోసం సంబంధం చూసేందుకు ఓ మ్యారేజ్‌ బ్యూరో నిరాకరించిందని దారుణానికి ఒడిగట్టాడో వృద్ధుడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని, నిప్పంటించుకున్నాడు. దక్షిణ కొరియాలోని జేజు ఐలాండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరి 16వ తేదీన 64 ఏళ్ల వృద్ధుడు ఓ మ్యారేజ్‌ బ్యూరోకు వచ్చాడు. విదేశీయులతో పెళ్లి సంబంధాలు కుదిర్చే ఆ సంస్థను తనకు సేవలు అందించాల్సిందిగా కోరాడు. తాను వివాహం చేసుకునేందుకు సత్వరమే ఓ అమ్మాయిని చూసిపెట్టాలని అడిగాడు. కానీ.. ఇక్కడే ఆ వృద్ధుడికి, మ్యారేజ్‌ బ్యూరో ప్రతినిధికి మధ్య వాగ్వాదం మొదలైంది. కాసేపటి తర్వాత ఆ వృద్ధుడు పట్టరాని కోపంతో ఊగిపోయాడు. తనతో తెచ్చుకున్న సీసా మూత తెరిచి.. అందులోని పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ వృద్ధుడిని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని