ఎన్‌డీఏలోకి మళ్లీ 19 మంది మహిళలేనా?

జాతీయ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)లోకి ఈ ఏడాది తీసుకోనున్న మహిళా అభ్యర్థుల సంఖ్యను 19కి పరిమితం చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో

Published : 19 Jan 2022 09:52 IST

కేంద్రం వివరణ కోరిన సుప్రీంకోర్టు

దిల్లీ: జాతీయ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)లోకి ఈ ఏడాది తీసుకోనున్న మహిళా అభ్యర్థుల సంఖ్యను 19కి పరిమితం చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొనడంపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు మంగళవారం ప్రశ్నించింది. వారి సంఖ్య పెంపునకు సంబంధించి తమ ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఎందుకు తక్కువ మందికి ప్రవేశం కల్పిస్తున్నారో మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మహిళా అభ్యర్థుల సంఖ్య గత ఏడాది కూడా 19గానే ఉన్న సంగతిని గుర్తుచేసింది. ‘‘మౌలిక వసతుల సమస్యల కారణంగా మహిళా అభ్యర్థులను తక్కువగా తీసుకుంటున్నట్లు గత ఏడాది మీరు చెప్పారు. ఈ ఏడాదికి కూడా అదే సంఖ్యను ప్రతిపాదించారు. ఎందుకిలా ఖరారు చేశారు? ఎప్పుడూ కేవలం 19 మందినే తీసుకుంటూ ఉండలేం’’ అని కేంద్రాన్ని ఉద్దేశించి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ సుందరేశ్‌ల ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని