
హైకోర్టు వర్చువల్ విచారణలో బాత్‌రూమ్ వీడియో ప్రత్యక్షం!
హైకోర్టు వర్చువల్ విచారణలో ఓ వ్యక్తి బాత్‌రూమ్‌లో షేవింగ్ చేస్తూ కనిపించటం కలకలం రేపింది. కేరళ హైకోర్టులో గత మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ వీజీ అరుణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది. విచారణలో పాల్గొన్న వ్యక్తి బాత్‌రూమ్‌లో ఉండగా వీడియో స్విచ్‌ఆన్ అయింది. ఈ విషయాన్ని అతను గుర్తించనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై దర్యాప్తు చేపట్టి, కారకులపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.