YouTube: యూట్యూబ్‌ చూసి ప్రయోగం.. లక్షల్లో ఆదాయం

లాక్‌డౌన్‌తో ఎంతో మంది జీవనోపాధి కోల్పోయారు. కొందరు మాత్రం దీన్ని అవకాశంగా మలుచుకున్నారు. 

Updated : 24 Jan 2022 10:20 IST

 

తిరువనంతపురం: లాక్‌డౌన్‌తో ఎంతో మంది జీవనోపాధి కోల్పోయారు. కొందరు మాత్రం దీన్ని అవకాశంగా మలుచుకున్నారు. కష్ట సమయంలో స్వయం ఉపాధి పొందారు. ఆ కోవకే చెందుతాడు కేరళలోని ఇడుక్కి జిల్లా రాజకుమారి గ్రామానికి చెందిన అభిజిత్‌. లాక్‌డౌన్‌లో యూట్యూబ్‌ వీడియోలు చూసి.. కోడిపిల్లల ఉత్పత్తి యూనిట్‌ నిర్మించి స్వయం ఉపాధి పొందాడు. అభిజిత్‌.. తొలుత కాలక్షేపం కోసం కోడి పిల్లల ఉత్పత్తికి సంబంధించిన వీడియోలు చూసేవాడు. తద్వారా ఆదాయం పొందవచ్చని గ్రహించాడు. వీడియోలో చెప్పిన విధంగా హేచరీ (కోళ్ల ఉత్పత్తి కేంద్రం) యూనిట్‌ నిర్మించడానికి కావాల్సిన థర్మోస్టాట్, ఫ్యాన్, బల్బులు, హీటర్, టైమర్, మోటారు, వాటర్‌ ఫాగర్, పెద్ద పెట్టెను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. ఇంటి వద్దే హేచరీ యూనిట్‌ నిర్మించాడు. తద్వారా ఇప్పటివరకు 3,000కుపైగా కోడిపిల్లలను ఉత్పత్తి చేసినట్లు అభిజిత్‌ చెబుతున్నాడు. తన యూనిట్‌ ద్వారా ఉత్పత్తయిన గుడ్లు, కోడిపిల్లలను విక్రయిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని