Pushups: పుష్‌అప్స్‌లో మణిపుర్‌ యువకుడి గిన్నిస్‌ రికార్డ్‌!

మణిపుర్‌కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు థౌనాఓజమ్‌ నిరంజాయ్‌ సింగ్‌.. 

Published : 24 Jan 2022 10:26 IST

మణిపుర్‌కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు థౌనాఓజమ్‌ నిరంజాయ్‌ సింగ్‌.. ఒక్క నిమిషంలోనే 109 పుష్‌అప్స్‌ తీసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ నెలకొల్పాడు. ఇప్పటివరకు బ్రిటన్‌కు చెందిన గ్రాహం మాలీ పేరిట ఉన్న రికార్డును(105) బద్దలుకొట్టాడు. ఫలితంగా ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాకు చెందిన నిరంజాయ్‌ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ పుష్‌అప్స్‌ రికార్డు ప్రయత్నం ‘అజ్టెక్స్‌ స్పోర్ట్స్‌ మణిపుర్‌’ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కొత్త రికార్డును ధ్రువీకరించడానికి ప్రయత్నించిన వీడియోలను లండన్‌లోని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుకు పంపనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని