Dance: పెళ్లిలో నృత్యం చేస్తూ.. మృత్యుఒడికి

ఓ వివాహ వేడుకలో అప్పటివరకు ఉత్సాహంగా ఆడిపాడిన ఆ యువకుడు.. 

Updated : 24 Jan 2022 09:25 IST

ఓ వివాహ వేడుకలో అప్పటివరకు ఉత్సాహంగా ఆడిపాడిన ఆ యువకుడు.. రెప్పపాటులో మృత్యుఒడికి వెళ్లిపోయాడు. ఈ అనూహ్య విషాదం మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లా దోరి గ్రామంలో జరిగింది. పెళ్లి వేడుకలో అంతలాల్‌(32) డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. క్షణాల్లోనే మృతిచెందాడు. కానీ బంధువులు, స్నేహితులు మాత్రం అంతలాల్‌ ఆట పట్టిస్తున్నాడేమో అనుకున్నారు. ఎంతసేపటికీ ఉలుకూపలుకూ లేకపోవడం వల్ల సమీప ఆసుపత్రికి తరలించారు. గుండెపోటుతో ఆ యువకుడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని