Updated : 25 Jan 2022 10:38 IST

పరీక్ష రాసేందుకు వెళ్లి మహిళ ప్రసవం.. శిశువుకు ‘టెట్‌’గా నామకరణం

ఉపాధ్యాయుల అర్హత పరీక్ష(టెట్‌) రాస్తుండగా ఓ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. అంబులెన్సులో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి సిబ్బంది ఆ పసివాడికి ‘టెట్‌’ అని పేరు పెట్టారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగింది. నాన్‌పుర్‌ బిటా గ్రామానికి చెందిన రేణు దేవి.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావాలన్న ఆశతో చాలారోజుల క్రితం టెట్‌కు దరఖాస్తు చేసింది. పరీక్ష సమయానికి ఆమె నిండు గర్భిణి. ఆదివారం టెట్‌కు హాజరయ్యేందుకు గజ్రైలాలోని డిగ్రీ కళాశాలకు భర్త సాయంతో వెళ్లింది. పరీక్ష రాస్తుండగా సాయంత్రం 4గంటల సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అప్రమత్తమైన ఇన్విజిలేటర్‌ వెంటనే అంబులెన్స్‌ను పిలిపించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ రేణు దేవి.. మగబిడ్డకు జన్మనిచ్చింది. టెట్‌ పరీక్షకు గుర్తుగా.. వైద్య సిబ్బంది ఆ పిల్లవాడికి టెట్‌ అని నామకరణం చేశారు. 

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని