Published : 25 Jan 2022 10:57 IST

ఒకేసారి 39 యుద్ధ విమానాలు.. తైవాన్‌కు చైనా కవ్వింపు

తైపే: తైవాన్‌పై చైనా కవ్వింపులు ఎక్కువయ్యాయి. ఆదివారం చైనా ఒకేసారి 39 యుద్ధ విమానాలను తైవాన్‌కు దగ్గరగా పంపింది. వాటిలో ఎలక్ట్రానిక్‌ యుద్ధ సామర్థ్యం గల విమానమూ ఉంది. చైనాకు దీటుగా తైవాన్‌ తన యుద్ధ విమానాలను వెంటనే మోహరించింది. తన గగనతల రక్షణ రాడార్లలో చైనా విమానాల కదలికలపై నిఘా వేసింది. గత 18 నెలలుగా చైనా తరచుగా యుద్ధ విమానాలతో తైవాన్‌ను కవ్విస్తోంది. గత అక్టోబరులో ఒకేరోజు 56 విమానాలను పంపింది. తైవాన్‌ అధ్యక్షురాలిగా త్సాయ్‌ ఇంగ్‌ వెన్‌ 2016లో ఎన్నికైనప్పటి నుంచి చైనా గిల్లికజ్జాల ధోరణి పెరిగింది. త్సాయ్‌కు ముందు తైవాన్‌ అధ్యక్షుడిగా ఉన్న మా యింగ్‌ జో చైనాతో సత్సంబంధాలు నెరిపేవారు. చైనా, తైవాన్‌లు ఒకే దేశమనే చైనా వాదంతో ఆయన ఏకీభవించేవారు. త్సాయ్‌ పగ్గాలు చేపట్టాక ఈ వాదాన్ని తోసిపుచ్చారు. అదే చైనా కోపానికి కారణమైంది. 1949 నాటి అంతర్యుద్ధం వల్ల చైనా నుంచి తైవాన్‌ వేరుపడినా, అది ఇప్పటికీ తమ అంతర్భాగమేనని బీజింగ్‌ ఉద్ఘాటిస్తోంది. దీన్ని ఒకే చైనా విధానంగా ప్రవచిస్తోంది. ప్రపంచ దేశాలు తైవాన్‌ను స్వతంత్ర, సార్వభౌమ దేశంగా గుర్తించకుండా ఒత్తిడి తెస్తోంది. తైవాన్‌ను బెదిరించడానికీ, ఏకాకిని చేయడానికి దౌత్య, సైనిక ఉపాయాలన్నీ ప్రయోగిస్తోంది. తైవాన్‌పై బలప్రయోగాన్ని సహించబోమని అమెరికా హెచ్చరిస్తోంది. 

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని