Published : 25 Jan 2022 12:37 IST

ఆజంఖాన్‌కు చెక్‌ పెట్టేందుకే!

 హైదర్‌తో భాజపా వ్యూహం ఫలించేనా.. 

ఈనాడు, లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేతల్లో ఒకరైన ఆజంఖాన్‌కు రాంపుర్‌ జిల్లాలో చెక్‌ పెట్టే వ్యూహంలో భాగంగా.. తమ మిత్రపక్షమైన అప్నాదళ్‌(ఎస్‌) ద్వారా హైదర్‌ అలీఖాన్‌ను స్వార్‌ స్థానంలో భాజపా బరిలో దించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎస్పీ తరఫున ఆజంఖాన్‌ కుమారుడు అబ్దుల్లా ఆజం పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లదే మెజార్టీ. రాంపుర్‌ రాజకుటుంబానికి చెందిన హైదర్‌ తండ్రి కాజిం అలీఖాన్‌కు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవముంది. అయితే 2017లో స్వార్‌లో పోటీ చేసిన ఆయన.. అబ్దుల్లా ఆజం చేతుల్లో పరాజయం చవిచూశారు. ఎన్నికల ప్రమాణపత్రంలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కాజిమ్‌ ఫిర్యాదు చేయడంతో.. తర్వాత అబ్దుల్లా తన శాసనసభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. జిల్లాలో ఆజంఖాన్‌-కాజిమ్‌ కుటుంబాల మధ్య చాలాకాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాల్లో భాగంగా స్వార్‌ను అప్నాదళ్‌(ఎస్‌)కే భాజపాకు కేటాయించి.. హైదర్‌ బరిలో దిగేలా పావులు కదిపింది. 


 

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని