Omicron: ‘డెల్టా’నూ అడ్డుకుంటున్న ఒమిక్రాన్‌ రోగనిరోధకత

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బారినపడిన వారిలో వస్తున్న రోగనిరోధక స్పందన గణనీయంగా ఉంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి

Updated : 27 Jan 2022 10:27 IST

ఐసీఎంఆర్‌ అధ్యయనం

దిల్లీ: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బారినపడిన వారిలో వస్తున్న రోగనిరోధక స్పందన గణనీయంగా ఉంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనం వెల్లడించింది. ఈ రోగనిరోధకత ఒమిక్రాన్‌పైనే కాకుండా.. డెల్టా సహా ఇతర ఆందోళనకర వేరియంట్లపైనా సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలిపింది. దీంతో డెల్టా రకం వల్ల మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా కూడా చేసే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఈమేరకు ఒమిక్రాన్‌కు ప్రత్యేక టీకా వ్యూహం అవసరాన్ని అధ్యయనం నొక్కిచెప్పింది. ఐసీఎంఆర్‌ ఒమిక్రాన్‌ బారినపడిన 39 మందిపై ఈ అధ్యయనం చేపట్టింది. ఇందులో ఆరుగురు టీకా తీసుకోనివారున్నారు. వీరిలో మొత్తం 28 మంది విదేశాల నుంచి వచ్చినవారు కాగా.. 11 మంది వారికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. అయితే టీకా పొందనివారిలో తక్కువ రోగనిరోధక స్పందన కనిపించింది. ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు ప్రగ్యా డి.యాదవ్, గజానన్‌ ఎన్‌.సప్కాల్, రీమా ఆర్‌.సహాయ్, ప్రియా అబ్రహం తదితరులు ఈ అధ్యయనం చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు