Satya Nadella: థ్యాంక్యూ ఇండియా: సత్య నాదెళ్ల

‘భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్‌ అవార్డు స్వీకరించడం గౌరవంగా భావిస్తాను.

Updated : 28 Jan 2022 10:35 IST


 

న్యూయార్క్‌: ‘భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్‌ అవార్డు స్వీకరించడం గౌరవంగా భావిస్తాను. భారత రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ అందరితో కలిసి పనిచేసేందుకు, భారతీయులు మరిన్ని విజయాలు సాధించేలా సాంకేతికతను మీకు చేరువ చేసేందుకు ఎదురుచూస్తున్నా’ అంటూ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల (54) గురువారం ట్వీట్‌ చేశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వం ఆయనకు ‘పద్మ భూషణ్‌’ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో పుట్టిన సత్య నాదెళ్ల 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో అయ్యారు. 2021 జూన్‌లో ఇదే కంపెనీ ఛైర్మన్‌ కూడా అయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని