అస్సాం-అరుణాచల్‌ మధ్య ఉద్రిక్తత

అస్సాం-అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులోని ధేమాజి జిల్లా గోగాముఖ్‌

Published : 28 Jan 2022 10:46 IST

​​​​​​

ఇటానగర్‌/ఉత్తర లఖింపుర్‌: అస్సాం-అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులోని ధేమాజి జిల్లా గోగాముఖ్‌ వద్ద రోడ్డు విస్తరణ పనుల వివాదం ఉద్రిక్తంగా మారింది. అరుణాచల్‌ ప్రభుత్వానికి చెందిన గుత్తేదారు నిర్మిస్తున్న గ్రామీణ రహదారి పనులకు అస్సాం స్థానికులు అభ్యంతరం తెలపడం హింసకు దారి తీసినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. ఈ సందర్భంగా అరుణాచల్‌ప్రదేశ్‌ గుత్తేదారు తుపాకి తీసి గాలిలోకి ఒక రౌండు కాల్పులు జరిపాడు. అరుణాచల్‌ ప్రభుత్వం పీఎంజీఎస్‌వై కింద 70 కిలోమీటర్ల మేర లికాబలి నుంచి దుర్పాయ్‌ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఈ పనులను వ్యతిరేకిస్తున్న అస్సాం గ్రామీణులు కొన్ని వాహనాలు ధ్వంసం చేశారు. నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన గుడారానికి నిప్పు పెట్టారు. సమాచారం అందుకొన్న అస్సాం పోలీసు దళం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని