ఆరేళ్ల ‘టైర్‌’డ్‌నెస్‌ నుంచి మొసలికి విముక్తి!

ద్విచక్ర వాహనం టైర్‌ మెడకు ఇరుక్కుని ఆరేళ్లుగా నరకం చూస్తున్న మొసలికి

Updated : 10 Feb 2022 13:12 IST

ద్విచక్ర వాహనం టైర్‌ మెడకు ఇరుక్కుని ఆరేళ్లుగా నరకం చూస్తున్న మొసలికి ఎట్టకేలకు విముక్తి లభించింది. ఓ యువకుడు స్థానికుల సాయంతో మొసలిని పట్టుకుని టైరును తొలగించాడు. ఇండోనేసియా పాలూ నగరంలోని నదిలో 4.5 మీటర్ల పొడవైన మొసలి మెడలో టైరు ఉన్నట్లు 2016లో స్థానికులు గుర్తించారు. వేటగాళ్లు ఎవరో ఈ పని చేసి ఉంటారని భావించారు. టైరు అంతకంతకూ బిగుసుకుపోయి మొసలి చనిపోతుందేమోనని నగరవాసులు భయపడేవారు. 2020లో ఆస్ట్రేలియా, అమెరికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు టైరును తొలగించేందుకు విఫలయత్నం చేశారు. గత నెలలో పాలూకు వచ్చిన పక్షుల వ్యాపారి టిలీ.. మొసలి గురించి తెలుసుకున్నాడు. ఎలాగైనా రక్షించాలని సంకల్పించాడు. నది వద్ద కోళ్లు, బాతులు, పక్షులను ఎరగా వేసి.. మొసలికి ఉచ్చు ఏర్పాటు చేశాడు టిలీ. ఈ క్రమంలో ఆ మొసలి వలలో పడింది. అనంతరం టిలీ ఇద్దరు మిత్రుల సాయంతో మొసలి మెడలోని టైరును కోసి బాధనుంచి విముక్తి కల్పించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని