Uttarakhand Elections 2022: మేం గెలిస్తే ‘ఉమ్మడి పౌరస్మృతి’ తెస్తాం

ఉత్తరాఖండ్‌లో భాజపా తిరిగి అధికారంలోకి వస్తే.. ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్‌ కోడ్‌) ముసాయిదా తయారీకి 

Published : 13 Feb 2022 10:37 IST

ఉత్తరాఖండ్‌ సీఎం హామీ..

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో భాజపా తిరిగి అధికారంలోకి వస్తే.. ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్‌ కోడ్‌) ముసాయిదా తయారీకి కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ శనివారం హామీ ఇచ్చారు. న్యాయ కోవిదులు, మేధావులు, ఇతర ప్రముఖులతో ఈ కమిటీ ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. వివాహం, విడాకులు, భూములకు సంబంధించిన ఆస్తులు, వారసత్వం తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుందన్నారు. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 70 స్థానాలకు ఈనెల 14న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని