Helicopter: పైలట్లు లేకుండానే హెలికాప్టర్‌ గగనవిహారం

పైలట్ల అవసరం లేని స్వయంచోదిత హెలికాప్టర్లను సాకారం చేసే దిశగా పెద్ద ముందడుగు పడింది.

Updated : 13 Feb 2022 11:04 IST

తొలిసారి ఎగిరిన బ్లాక్‌ హాక్‌  

వాషింగ్టన్‌: పైలట్ల అవసరం లేని స్వయంచోదిత హెలికాప్టర్లను సాకారం చేసే దిశగా పెద్ద ముందడుగు పడింది. అమెరికాకు చెందిన బ్లాక్‌ హాక్‌ సైనిక హెలికాప్టర్‌ ఈ విధానంలో తొలిసారి గగనవిహారం చేసింది. ప్రత్యేక సాధనసంపత్తితో కూడిన ఈ లోహవిహంగం.. ఒక సిమ్యులేటెడ్‌ నగరంలో అరగంట పాటు ఎగిరింది.   ఆకాశహర్మ్యాలను తప్పించుకుంటూ ఒడుపుగా ప్రయాణించింది. అనంతరం నిర్దేశిత ప్రదేశంలో భద్రంగా దిగింది. ప్రయాణ సమయంలో ఇది 4వేల అడుగుల ఎత్తుకు చేరింది. గరిష్ఠంగా గంటకు 125 మైళ్ల వేగాన్ని అందుకుంది. ఇటీవల రెండుసార్లు బ్లాక్‌ హాక్‌ను ఈ పద్ధతిలో గగనవిహారం చేయించారు.

ఈ హెలికాప్టర్‌ పూర్తిగా కంప్యూటర్‌ సాయంతో ఎగిరింది. ‘అలియాస్‌’ పేరిట చేపట్టిన రక్షణ పరిశోధన ప్రాజెక్టు కింద అమెరికా దీన్ని అభివృద్ధి చేసింది. పైలట్లు అవసరం లేకుండానే సంక్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో రాత్రీపగలు సురక్షితంగా గగనవిహారం చేసేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని