పెళ్లితో ఒక్కటైన ట్రాన్స్‌జెండర్ల జంట.. దేశంలో ఇదే తొలిసారి!

కేరళలో అరుదైన పెళ్లి జరిగింది. ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు వివాహం చేసుకున్నారు. లింగమార్పిడి చేయించుకున్న ఇద్దరు వ్యక్తులు

Published : 15 Feb 2022 11:00 IST

కేరళలో అరుదైన పెళ్లి జరిగింది. ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు వివాహం చేసుకున్నారు. లింగమార్పిడి చేయించుకున్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. ప్రేమికుల రోజునే ఈ పెళ్లి జరగడం విశేషం. ట్రాన్స్‌జెండర్లైన శ్యామ ఎస్‌ ప్రభ, మను కార్తిక పదేళ్లుగా స్నేహితులు. కార్తిక ఓ ప్రైవేటు సంస్థ మానవ వనరుల విభాగంలో ఉద్యోగి. కేరళ ప్రభుత్వ సంక్షేమ శాఖ ట్రాన్స్‌జెండర్‌ విభాగం సమన్వయకర్త. ఐదేళ్ల క్రితమే పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో లింగమార్పిడి చేయించుకున్నారు. ప్రేమికుల రోజున తిరువనంతపురంలో బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ రకమైన వివాహం చట్టబద్ధం కాదు. దీనిపై వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. తమ పెళ్లి ట్రాన్స్‌జెండర్‌ వివాహాల్లో సరికొత్త మైలురాయి కానుందని ఈ సందర్భంగా ప్రభ, మను తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు