అమితాబ్ బాడీగార్డ్‌గా పనిచేసిన కానిస్టేబుల్ జితేంద్ర లీలలు
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు గతేడాది ఆగస్టు వరకు అంగరక్షకుడిగా పనిచేసిన ముంబయి పోలీసు కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
సతీమణి పేరుతో సెక్యూరిటీ సంస్థ.. రూ.కోట్లలో ఆర్జన
ముంబయి: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు గతేడాది ఆగస్టు వరకు అంగరక్షకుడిగా పనిచేసిన ముంబయి పోలీసు కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సర్వీసు నిబంధనలు ఉల్లంఘించడమే ఇందుకు కారణమని ఓ అధికారి బుధవారం చెప్పారు. 2015 నుంచి ఆగస్టు 2021 వరకు అమితాబ్‌కు జితేంద్ర అంగరక్షకుడిగా పనిచేశారన్నారు. ఈ క్రమంలో ఆయన వార్షిక ఆదాయం రూ.1.5 కోట్లు దాటిన సంగతి తెలియడంతో ముంబయి పోలీసు కమిషనర్ హేమంత్ నగ్రాలే అమితాబ్‌కి భద్రత కల్పించే బాధ్యతల నుంచి తప్పించారు. అనంతరం డీబీ మార్ పోలీసుస్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు. శిందే సస్పెన్షన్‌కు దారితీసిన అసలు కారణం ఏమిటని ప్రశ్నించగా.. ఉన్నతాధికారులకు చెప్పకుండా సింగపూర్, దుబాయ్‌లకు శిందే కనీసం నాలుగుసార్లు వెళ్లొచ్చారని ముంబయి పోలీసు విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
విదేశాలకు వెళ్లాలంటే సర్వీసు నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. దీంతో పాటు కానిస్టేబుల్ తన భార్య పేరు మీద ఓ సెక్యూరిటీ సంస్థను ఏర్పాటు చేశారని, ఆ సంస్థే బచ్చన్ కుటుంబసభ్యులకు భద్రత కల్పిస్తోందని చెప్పారు. ఇందుకు సంబంధించిన రుసుములన్నీ శిందే ఖాతాలో కనిపిస్తున్నాయని, ఆయన భార్య ఖాతాలో కాదని ఆ అధికారి చెప్పారు. దీనికి తోడు శిందే కొన్ని ఆస్తులు కొన్నట్లుగా కూడా ప్రాథమికంగా వెల్లడైందని, ఆ వివరాలను ఆయన వెల్లడించలేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు