Truth Social: ఫేస్‌బుక్, ట్విటర్‌కు పోటీగా ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ వార్తల్లోకి వచ్చారు.

Updated : 22 Feb 2022 11:15 IST

యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో లభ్యం

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. గత ఏడాది క్యాపిటల్‌ భవనంపైకి తన మద్దతుదారులను ఉసిగొల్పి... హింసాత్మక ఘటనలకు కారణమవ్వడంతో ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమ సంస్థలు ఆయనపై నిషేధం విధించాయి. ఇది రాజకీయ వివక్ష అంటూ అప్పట్లో ధ్వజమెత్తిన ట్రంప్‌.. ఇప్పుడు ట్విటర్, ఫేస్‌బుక్‌ లాంటి సంస్థలకు పోటీగా ఏకంగా తానే సామాజిక మాధ్యమ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని పేరు ‘ట్రూత్‌ సోషల్‌’. ఇది యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో విడుదలైంది. ఇందులో రాజకీయ వివక్ష ఉండదని యాప్‌ను రూపకల్పన చేసిన ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ తెలిపింది. దీనికి సంబంధించి బీటా వెర్షన్‌ టెస్టింగ్‌ కూడా పూర్తయ్యింది. ట్విటర్‌ను పోలి ఉండే ఈ యాప్‌లోనూ ఒకరినొకరు అనుసరించొచ్చు. ట్రెండింగ్‌లో ఉన్న విషయాలు తెలుసుకోవచ్చు. ట్విటర్‌లో పోస్ట్‌ చేసేవాటిని ట్వీట్‌ అంటాం. ట్రూత్‌ సోషల్‌ మీడియా యాప్‌లో మాత్రం ‘ట్రూత్‌’ అని సంబోధిస్తారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని