Luck: ఇటుక బట్టీ నిర్వాహకుడిని వరించిన అదృష్టం

నిస్సారమైన వజ్రాల గనిలో చిన్నపాటి ఇటుక బట్టీని నిర్వహిస్తున్న వ్యక్తిని అదృష్టం వరించింది. 26.11 క్యారట్ల విలువైన 

Updated : 23 Feb 2022 10:35 IST

రూ.1.20 కోట్ల విలువైన వజ్రం లభ్యం

పన్నా: నిస్సారమైన వజ్రాల గనిలో చిన్నపాటి ఇటుక బట్టీని నిర్వహిస్తున్న వ్యక్తిని అదృష్టం వరించింది. 26.11 క్యారట్ల విలువైన వజ్రం లభించింది. వేలంలో ఈ వజ్రం రూ.1.20 కోట్ల ధర పలకొచ్చని మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన వజ్రాల అధికారి రవి పటేల్‌ తెలిపారు. పన్నా పట్టణానికి చెందిన సుశీల్‌ శుక్లా, అతని తల్లిదండ్రులు.. కృష్ణ కల్యాణ్‌పుర్‌ ప్రాంతంలోని గనుల్లో సోమవారం ఈ వజ్రాన్ని గుర్తించారని వివరించారు. దీనిని త్వరలో వేలం వేస్తామని,  వచ్చిన మొత్తంలో పన్నులు, రాయల్టీ పోగా మిగిలిన మొత్తం శుక్లాకు అందజేస్తామని చెప్పారు. తమ కుటుంబం 20 ఏళ్లుగా గనుల తవ్వకం పనుల్లో ఉందని, ఇంత విలువైన వజ్రం దొరకడం ఇదే తొలిసారని ఈ సందర్భంగా శుక్లా చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని