Omicron: ఒమిక్రాన్‌ తర్వాత.. హెర్డ్‌ ఇమ్యూనిటీ దశ?

‘అత్యధికంగా సంక్రమించే గుణం గల వేరియంట్‌ ఏదైనా హెర్డ్‌ ఇమ్యూనిటీకే 

Updated : 24 Feb 2022 11:02 IST

వాషింగ్టన్‌: ‘అత్యధికంగా సంక్రమించే గుణం గల వేరియంట్‌ ఏదైనా హెర్డ్‌ ఇమ్యూనిటీకే దారి తీస్తుంది. కరోనా వైరస్‌ విషయంలో దీనిపై అప్పుడే ఓ అంచనాకు రాలేం’ అని మేరిల్యాండ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ డాన్‌ మిల్టన్‌ తెలిపారు. జనాభాలోని ఓ ప్రాంతానికి చెందిన అందరిలో వైరస్‌ను అడ్డుకొనే రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాక్సిను తీసుకోకపోయినా మరో ప్రాంతానికి ఆ వైరస్‌ విస్తరణ జరగకపోతే ఆ దశను హెర్డ్‌ ఇమ్యూనిటీ అంటారు. 

‘క్రమంగా ఆయా ప్రాంతాలు హెర్డ్‌ నిరోధకత దిశగా సాగుతున్నాయి. ఇన్ఫెక్షన్లు ఉంటాయి. కానీ, ప్రజలకు తగినంత రక్షణ ఉంటుంది. భవిష్యత్తులో ఎదురయ్యే వేరియంట్లు సమాజానికి అంత ఇబ్బందికరంగా ఉండవు’ అని మిల్టన్‌ తెలిపారు. కొవిడ్‌-19 రాను రాను ఓ సాధారణ జలుబులా మారి, సీజనల్‌ రుగ్మత మాదిరి పెద్దగా ఇబ్బందులు ఉండవని.. విస్తృత వ్యాప్తి కూడా ఉండదని చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్నదే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని