Ukraine Crisis: అణుబూచి వెనుక బ్రిటన్‌!

అణ్వాయుధాల వినియోగానికి సిద్ధంగా ఉండాలంటూ ఆదివారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇచ్చిన ఆదేశాల 

Updated : 01 Mar 2022 10:12 IST

లిజ్‌ ట్రస్‌ వ్యాఖ్యలతోనే మోహరించాం: రష్యా

లండన్‌: అణ్వాయుధాల వినియోగానికి సిద్ధంగా ఉండాలంటూ ఆదివారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇచ్చిన ఆదేశాల వెనుక బ్రిటన్‌ ఉందా? అంటే అవుననే అంటోంది మాస్కో. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగానే తమ అధ్యక్షుడు అణ్వాయుధాల మోహరింపునకు ఆదేశాలిచ్చారని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ ఆదివారం తెలిపారు. ఉక్రెయిన్‌ దాడి విషయంలో చాలా మంది ప్రతినిధులు వివిధ స్థాయిల్లో నాటో కూటమికి రష్యాకు మధ్య ఘర్షణలు చోటు చేసుకోవచ్చని చెప్పారని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారని విలేకరులు ప్రశ్నించినపుడు పెస్కోవ్‌ పేరు తీయనంటూనే.. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి అని చెప్పారు.

చర్చలతో పరిష్కరించుకోండి: అరబ్‌లీగ్‌

కైరో: ఉక్రెయిన్‌లో యుద్ధంపై అరబ్‌లీగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యను చర్చలతో పరిష్కరించుకోవాలని ప్రకటన విడుదల చేసింది. ఎక్కడా రష్యా పేరును ప్రస్తావించలేదు. 22 దేశాల అరబ్‌లీగ్‌లో సౌదీ అరేబియా, ఈజిప్ట్‌ తదితర దేశాలు ఉన్నాయి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని