
సాఫ్ట్వేర్ ఇంజినీర్ గలీజు దందా!: 200 మంది మహిళలు.. 4వేల నగ్న ఫొటోలు
దిల్లీ: బాలికలు, విదేశీయులు సహా 200 మందికిపైగా మహిళల్ని బెదిరించి, వారి నగ్న చిత్రాలను పోర్న్ వెబ్సైట్లకు విక్రయించిన కీచకుడ్ని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి లాప్టాప్లో ఏకంగా 4వేల నగ్న ఫొటోలు చూసి విస్తుపోయారు. మెకానికల్ ఇంజినీరింగ్, ఎంబీఏ చదివి.. ఓ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలో ఉద్యోగం చేస్తున్న నిందితుడు మోహిత్ శర్మ(33) ఈ అక్రమ దందా సాగిస్తున్న తీరును దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ మహిళ తనను బెదిరించి, నగ్న చిత్రాలు తీసుకుందని 2020 సెప్టెంబర్, 2021 జూన్‌లో దిల్లీ సైబర్ సెల్ పోలీసులకు ఆన్లైన్ ద్వారా రెండు ఫిర్యాదులు అందాయి. వాటిపై ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగం రంగంలోకి దిగింది. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడీని, దానిని సృష్టించేందుకు ఉపయోగించిన ఈ మెయిల్ ఐడీని ట్రాక్ చేసింది. నొయిడాలోని ఓ ఇంటి నుంచే ఇదంతా జరిగిందని గుర్తించింది. అనంతరం ఏసీపీ రామన్ లాంబా, ఇన్స్పెక్టర్ అరుణ్ త్యాగి బృందం ఆ ఇంటికి వెళ్లగా.. మోహిత్ శర్మ ఉన్నాడు. ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన వైఫై హ్యాక్ అయిందని, ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశానని తొలుత బుకాయించాడు. అయినా పోలీసుల బృందం అతడి ఫోన్లు, లాప్‌టాప్‌లు అన్నింటినీ పరిశీలించగా అతడి నిర్వాకం బయటపడింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
-
India News
Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
-
Viral-videos News
Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
-
India News
Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాల కేసులో షార్ప్‌షూటర్ అరెస్టు
-
Sports News
IND vs ENG: శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్.. వీడియో చూడండి
-
Movies News
Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
- Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
- మొత్తం మారిపోయింది
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Maharashtra: ఉద్ధవ్ వైపే ఉంటానని కన్నీరు పెట్టుకొని.. శిందేకు ఓటేశారు!