రూ.100 కోట్లకుపైగా మోసాలు.. దుబాయికి పారిపోతున్న కుటుంబం అరెస్టు

నకిలీ పత్రాలతో రూ.కోట్లకు టోకరా వేసిన కుటుంబాన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ గాజియాబాద్‌కు చెందిన ఓ కుటుంబం.. నకిలీ కంపెనీలు, పత్రాలు సృష్టించి రూ.100 కోట్లకు పైగా మోసాలకు పాల్పడింది.

Updated : 02 Mar 2022 10:59 IST

లఖ్‌నవూ: నకిలీ పత్రాలతో రూ.కోట్లకు టోకరా వేసిన కుటుంబాన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ గాజియాబాద్‌కు చెందిన ఓ కుటుంబం.. నకిలీ కంపెనీలు, పత్రాలు సృష్టించి రూ.100 కోట్లకు పైగా మోసాలకు పాల్పడింది. ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ జైన్‌.. తన భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెతో కలిసి ఈ మోసాలు చేశాడు. అతనికి ఇద్దరు బంధువులు సైతం తోడయ్యారు. ఈ ముఠా తప్పుడు పత్రాలను తయారు చేసి.. ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లను ఒకటి కంటే ఎక్కువసార్లు విక్రయించేది. తక్కువ ధరకే వీటిని అమ్మేయడం వల్ల.. అనేక మంది వీరి వలలో చిక్కారు. వివిధ పోలీసుస్టేషన్లలో వీరిపై 29కిపైగా కేసులు నమోదయ్యాయి. అయినా పోలీసులకు చిక్కకుండా.. ఎప్పటికప్పుడు గుర్తింపును మార్చుకుంటూ పోలీసుల కన్నుగప్పేవారు. దేశ రాజధాని ప్రాంతంలో ఐడియా బిల్డర్స్, మంజు హోమ్స్, రెడ్‌ యాపిల్‌ వంటి పేర్లతో 12కుపైగా నకిలీ కంపెనీలను సృష్టించారని చెప్పారు. ఈ నకిలీ ఆధార్‌ కార్డులతో దుబాయి పౌరసత్వ కార్డును సైతం సంపాదించారని వెల్లడించారు. ఈ క్రమంలో దుబాయికి పారిపోతుండగా.. పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారి దగ్గర నుంచి 4 ల్యాప్‌టాప్‌లు, 5 మొబైల్‌ ఫోన్లు, 13 నకిలీ ఆధార్‌ కార్డులు, 4 నకిలీ పాన్‌ కార్డులు, చెక్‌ బుక్‌లు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దుబాయి రెసిడెన్సీ కార్డు సైతం వీరి వద్ద ఉన్నట్లు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని