Marriage: ఒకే వ్యక్తిని పెళ్లాడిన ముగ్గురు కవలలు..
కాంగోకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి లువిజో.. ఒకేరోజు ఒకేసారి ముగ్గురు కవలలను పెళ్లాడాడు.
కాంగోకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి లువిజో.. ఒకేరోజు ఒకేసారి ముగ్గురు కవలలను పెళ్లాడాడు. అయితే.. లువిజో ప్రేమించింది మాత్రం ఒకరినే. చివరికి ముగ్గురిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లువిజోకు సోషల్ మీడియా ద్వారా నటాలీ పరిచయమైంది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇలా ప్రేమలో ఉన్న ఇరువురూ తరచూ కలుస్తుండేవారు. అప్పుడే తొలి షాక్ తగిలిందతనికి. నటాలీతో పాటు.. అచ్చం ఆమెలానే ఉండే మరో ఇద్దరిని కలిశానన్న విషయం అతడికి తెలిసేందుకు చాలా సమయమే పట్టింది. ఒకేలా ఉన్నారు కాబట్టి.. అతడూ గుర్తించలేకపోయాడు. నటాలీతో పాటు.. నటాషా, నడెగేతో ప్రేమలో పడిపోయాడు. వారంతా ఒకరోజు ఒకేసారి వచ్చి.. ముగ్గురం ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని అసలు విషయం చెప్పారు. ఇది విని లువిజో తొలుత ఆశ్చర్యపోయినప్పటికీ.. వారి మాటను కాదనలేకపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్