Rupa Dutta: పర్స్‌లు కొట్టేస్తూ అడ్డంగా దొరికిన నటి

కోల్‌కతాలో జరుగుతున్న అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో దొంగతనం చేసినందుకు

Published : 14 Mar 2022 09:42 IST

కోల్‌కతాలో జరుగుతున్న అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో దొంగతనం చేసినందుకు బెంగాలీ నటి రూపా దత్తాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చాకచక్యంగా బాధితుల దృష్టి మరల్చి వారి పర్సులను కొట్టేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా కొట్టేసిన ఓ పర్స్‌ను ఆమె చెత్త కుండీలో వేయడం చూసిన ఉత్తర బిధాన్‌నగర్‌ పోలీసు అధికారి అమెను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయట పడింది. పోలీసులు ప్రశ్నిస్తుండగా.. రూప చెప్పిన సమాధానాలతో వారికి సందేహం వచ్చింది. ఈ క్రమంలో ఆమె బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో రూ.75 వేల నగదుతో పాటు కొన్ని పర్స్‌లు  ఉన్నట్లు గుర్తించారు. ఈ నేరంతో ఇంకెవరికైనా సంబంధం ఉందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూపా దత్త బెంగాలీలో కొన్ని సీరియల్స్‌లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని