Andhra News: ‘నాకు సహకరించు.. ప్రమోషన్‌ ఇప్పిస్తా.. లేదంటే..’

‘చేస్తున్న ఉద్యోగం స్థాయి పెంచి పోస్టింగ్‌ ఇప్పిస్తా.. నాకు సహకరిస్తే సరి.

Updated : 18 Mar 2022 10:59 IST

అంగన్‌వాడీ ఆయాకు అధికార పార్టీ నేత కుమారుడి బెదిరింపు 

యడ్లపాడు, న్యూస్‌టుడే: ‘చేస్తున్న ఉద్యోగం స్థాయి పెంచి పోస్టింగ్‌ ఇప్పిస్తా.. నాకు సహకరిస్తే సరి.. లేకపోతే ఉన్న ఉద్యోగమూ లేకుండా చేస్తా’ అని ఓ అంగన్‌వాడీ ఆయాను అధికార పార్టీ నేత కుమారుడు బెదిరించిన వైనమిది. బాధితురాలి కథనం ప్రకారం... గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని ఓ ప్రజాప్రతినిధి కుమారుడు బుధవారం బాధితురాలు పని చేస్తున్న చోటికి వచ్చాడు.

తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పదోన్నతి కల్పిస్తానని, తనకు సహకరించాలని ఆమెతో వంకరగా మాట్లాడాడు. అతడి దురుద్దేశాన్ని గుర్తించిన ఆమె అందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన అతడు నీ సంగతి తర్వాత చూస్తానంటూ బెదిరించి వెళ్లాడు. బాధితురాలు గురువారం తనపై అధికారికి ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని