Crude Oil: రోజుకు 27 లక్షల బ్యారెళ్ల.. చమురు ఆదా కావాలంటే..!

 ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం చమురు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా రోజుకు 27 లక్షల 

Updated : 19 Mar 2022 10:34 IST

పొదుపునకు పది సూత్రాలు : ఐఈఏ

బెర్లిన్‌: ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం చమురు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా రోజుకు 27 లక్షల బ్యారెళ్ల మేర డిమాండ్‌ను తగ్గించాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) సూచించింది. త్వరితగతిన చమురు డిమాండ్‌ను తగ్గించడానికి గాను 10 కీలక సూచనలు చేసింది. ఈమేరకు శుక్రవారం విడుదల చేసిన ఓ నివేదికలో.. ప్రభుత్వాలు, ప్రజల కార్యాచరణతో చమురును గణనీయంగా ఆదా చేయవచ్చని తెలిపింది. అత్యధిక డిమాండ్‌ కాలమైన జులై, ఆగస్టుల నాటికి చమురు ఆదాకు సంబంధించి వీటిని పాటించాలని వివిధ దేశాలను కోరింది.

ఐఈఏ సూచనలివే..

  • హైవేలపై వేగ పరిమితిని కనీసం గంటకు 10 కి.మీ.ల మేర తగ్గించాలి.

  • సాధ్యమైనంతమేర వారంలో 3 రోజుల పాటు ఇంటి నుంచి పని చేయించాలి.

  • పెద్ద నగరాల్లో ఆదివారం కార్లకు అనుమతి ఇవ్వరాదు.

  • ప్రజారవాణాను మరింత చౌక చేయాలి. నడక, సైకిళ్లు వంటివాటిని ప్రోత్సహించాలి.

  • పెద్ద నగరాల్లో ప్రత్యామ్నాయ (సరి-బేసి) విధానాల్లో ప్రైవేటు కార్లకు అనుమతించాలి.

  • కార్‌ షేరింగ్‌ వంటి విధానాలను ప్రోత్సహించాలి.

  • వస్తు సామగ్రి రవాణాకు ట్రక్కులు వంటివాటిని సమర్థంగా వినియోగించాలి.

  • వీలయిన ప్రాంతాల్లో విమానాలకు బదులు అత్యంత వేగవంతమైన (హై-స్పీడ్‌), రాత్రిపూట నడిచే రైళ్లను వినియోగించాలి.

  • ప్రత్యామ్నాయాలు (వీడియో కాన్ఫరెన్సింగ్‌ వంటివి) ఉన్న పరిస్థితుల్లో బిజినెస్‌ విమాన ప్రయాణాలను మానుకోవాలి. 

  • విద్యుత్తుతో నడిచే, మెరుగైన ఇంధన సామర్థ్యం ఉండే వాహనాలను ప్రోత్సహించాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని